Friday, November 23, 2007

ఒక్క క్షణం చాలు


ఒక్క క్షణం చాలు

నీ ఓరచూపుకి

మత్తెక్కి చిత్తైన నా మనసు

నీ చిరునవ్వుకి

రెపరెపలాడి కొట్టుకొంటోంది


నీ సమక్షంలో నాకు

ఇంకొక్క క్షణం గడిస్తే చాలు

నీ కనురెప్పల చాటున చేరి

ఓ స్వప్నం లిఖించడానికి

నువ్వు లేనప్పుడు...


నువ్వు లేనప్పుడు...

నువ్వున్నప్పుడు...

టీవీ లో క్రికెట్టో, ఫుట్‌బాలో చూస్తూ

నువ్వేసిన పకోడీలు తిని, నువ్విచ్చే కాఫీ తాగి

నీ మీద వెధవ జోకులేస్తూ

మేధావిలా ఫోజెట్టికిటికీలోంచి పక్కింటి అమ్మయిని చూసి ఈలవేసి

ప్రతి క్షణం నా మగ బుద్ధిని చూపించే నేను...

నువ్వు దగ్గర లేనప్పుడు...

రేడియోలో రఫీ పాటలు వింటూ

తిండి సయించక మూడంకె వేసుకు పడుకుని

నిర్వేదంగా నాలోనేనే నవ్వుకుంటూ

గది కప్పు కేసి గంటల తరబడి చూస్తూ

స్థాణువునై పడున్నాను

ఘొష


ఘొష

ఏమని చెప్పను ఎలా చెప్పను..

మాటలకందని ఆవేదన..

దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని..

ఇనుప సంకెల్ల్లను కసిగా తెంచాలని..

ఈ రక్తమాంసదేహం నుండి విమూక్తి పొందాలని..ఏదో సాధించాలని..

మదిలొ అలజడి..

ఎవరో చెప్పారు..

మదిలొని భావాలని వ్యక్తపరచలేని

అసహాయతను మించిన పేదరికము మరొకటిలేదని..

నేనొక నిశభ్ధ ప్రేక్షకుడిని..

నేను


నేను

ఎన్నెన్నో మెలకువ రాత్రుల్లో

మధించబడిన హ్రుదయం...

అమృతం జనించింది ఆశయ రూపంలో


ఖర్చు చేసిన క్షణాల విలువ

ఒక ఉదయం మనిషి గా మరో జననం

ఎదురుగా లక్ష్యం - సైనికుడిలా నేను

చేరడానికి దారిలేదు - దీక్ష తప్ప


పర్వాలేదు - చదునుచేస్తాను

వెనుకవచ్చువాళ్ళకోసం బాటలేస్తాను..

ఎదురుగా లక్ష్యం - కార్మికుడిలా నేను

లేఖ


లేఖ


నీ లేఖలో ని ప్రతీ వాక్యం

ఎన్ని కబుర్లు చెబుతుందో

నిశ్శబ్ధం గా


ఎన్ని జ్ఞాపకాలను తడుతుందో

ఇరికించి మరీ రాసే అక్షరాలు

ఎంత ఆప్యాయతను చూపిస్తాయో

చదివిన ప్రతీ సారీ

మదిలోఎన్ని రంగులను

నింపుతున్నయో


అల్మారాలో,బట్టల మడతల్లో

పరుపు క్రింద,ఫొటోల వెనుక

ఎక్కడ చూసినా నీ అక్షరాలే

వాటి తాలూకూ పరిమళాలే

ఎప్పుడూ నీ ఉత్తరాలతో పాటూ

నా దగ్గరగానువ్వు


-స్నేహం తో

నీ చిరు నవ్వు